దేశభక్తి ఎంతవరకు ఉండాలి?
మనం చెడ్డిలేసుకొని స్కూలుకి వెళ్లిన దగ్గర్నుంచి వింటున్న మాటలే ఇవి. దేశాన్ని ప్రేమించాలి అని కొందరు, " భారత్ మాతాకి జై" అని ఇంకొందరు, జన గణ మన అని వచ్చీ రాని బెంగాలీ పాట పాడుతూ అందరూ..!
Social studies లో మనకి Geography, polity, constitution, federalism, imperialism, secularism, fundamental rights, directive principles, దేశం ఎలా ఏర్పడింది, ఎవరెవరు పరిపాలించారు, ఇవన్నీ పరిచయం కాక ముందే దేశ భక్తి పరిచయం అయిపోతుంది. దేశం అంటే ప్రపంచ పటంలో ఒక కాల్పనిక భౌగోళిక ప్రదేశం అని సరిగా అర్థం కాని వాడు కూడా పాకిస్తాన్ని అమ్మనా బూతులు తిడతాడు, దేశం నా అమ్మ, ఇలాంటి దేశం ఇంకెక్కడా లేదు ఆని డాబుగా చెప్తాడు. కానీ బయట మాత్రం రోడ్ల మీద ఉచ్చ పొయ్యటం, చెత్త వెయ్యటం, ఉమ్మటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డ గాడిదలాగా వెళ్ళటం, ఇలాంటివి చేస్తాడు. నిజంగా దేశాన్ని ప్రేమించే వాడు ఇలాంటివి చెయ్యొచ్చా? రేప్పొద్దున ఇలాంటి ఒక వ్యక్తి ఏ గవర్నమెంట్ ఉద్యోగమో చేస్తూ 50 లక్షలు లంచం తిని, ఆగష్టు 15న జాతీయ జెండా ఎగురవేస్తే అతన్ని ఒక "patriot" గా గుర్తించవచ్చా.? లేదు కదా..! కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అదే. దేశంలో ఆస్తులు అన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి, పైకి మాత్రం జాతీయవాద పార్టీగా నటిస్తున్నారు. వాళ్ళు నటిస్తే మనం ఎక్కడ పట్టేస్తామా అని మనకి ఒక దేశ భక్తి అనే వ్యసనాన్ని అంటిస్తున్నారు. లేకపోతే సినిమా హాళ్ళలో జాతీయగీతం ఎందుకు? అసలు అది జన గణ మన పాడల్సిన చోటేనా.? ఒక తాగుబోతు లుంగీ కట్టుకుని మిడ్నైట్ షోకి వెళ్లి బలవంతగా నిలబడి జాతీయ గీతం పాడితే అది దాని విశష్టతను అవమానుంచినట్లు కాదా.? ఇది సరిపోదు అన్నట్లు ప్రపంచంలోని ప్రతి టెక్నాలజీ మన వేదాల్లో ముందే ఉంది అని pseudoscience ని విపరీతంగా ప్రచారం చేయటం, ఏదైనా నోట్ల రద్దు లాంటి పనికిమాలిన చర్య తీస్కొని బ్యాంకుల వద్ద ప్రజలని రోజుల తరబడి క్యు లైన్లో నిలబడేలా చెయ్యడం, ఇదేంటి అని అడిగితే బార్డర్లో సైనికుడు దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నాడు, మీరు కనీసం లైన్లో నిలబడలేరా అని సమర్దించుకోవడం, ఇష్టం వచ్చినట్లు పెట్రోలు రేట్లు పెంచి అడిగితే దేశ అభివృద్ధికి పన్నులు కట్టలేరా, వాక్సిన్ ఉచితంగా ఇస్తున్నంగా అని ఏదో ముష్టి వేసినట్లు జవాబు ఇవ్వటం, దేశం GDP పడిపోతుంది ఏంటి అని అడిగితే, ఆర్మీ వాళ్ళకి హెలికాప్టర్లు, బుల్లెట్టు ప్రూఫు జాకెట్లు కొన్నాం, మన రక్షణ వ్యవస్థ బాగుపడటం చైనా, అమెరికా వాళ్ళకి నచ్చక మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో.
మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేశం మన అమ్మ, అక్క, పిన్ని ఇంకేది కాదు, మన మనుషులే మన సౌలభ్యం కోసం ఏర్పరుచుకున్న ఒక సమూహం. Constitution లో కూడా India is an " Union of States" అనే ఉంటుంది. నా వరకు దేశాన్ని నిజంగా ప్రేమించటం అంటే, వీలైనంత వరకు మంచి పౌరుడిగా బ్రతకడం, పన్నులు సరిగా కట్టడం, మనకి ఉన్న పాధమిక హక్కులు, బాధ్యతలు సక్రమంగా పాటించటం. అంతే.!
విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల విషయంలో ప్రపంచంలో ఎక్కడో వెనకబడిన దేశాల పక్కన నిల్చోని, "సారే జహాసే అచ్చా" అని పాడటం మూర్కత్వం మాత్రమే, ఇంకేమి కాదు.
Comments
Post a Comment